బాంబు బెదిరింపులు వస్తే ఎలా ఎదుర్కోవాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు సైబరాబాద్ పోలీసులు. బాంబు స్క్వాడ్ బృందాలు ఎలా పని చేస్తాయో మాక్ డ్రిల్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని భాగ్యనగర్ గ్యాస్ సరఫరా కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
Bomb Squad: గ్యాస్ కేంద్రంలో బాంబు స్క్వాడ్ - మాక్ డ్రిల్
గ్యాస్ సరఫరా కేంద్రంలో బాంబు స్క్వాడ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని భాగ్యనగర్ గ్యాస్ కేంద్రంలో సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
గ్యాస్ కేంద్రంలో బాంబు స్క్వాడ్ బృందాల మాక్ డ్రిల్
ఏదైనా ప్రదేశంలో బాంబు ఉన్నట్లు సమాచారం వస్తే ఎలాంటి చర్యలు చేపడతారో వివరించారు. ప్రజలు ముందుగా అప్రమత్తంగా ఉండి 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగానే బాంబు పేలుడు జరగకుండా ఎలా నిర్వీర్యం చేస్తారో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.
ఇదీ చూడండి:CM KCR: ఈ నెల 22న వాసాలమర్రికి సీఎం కేసీఆర్