శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన దుర్ఘటన విషయమై సీఎం కేసీఆర్కు మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఘటనలో మృతులందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలంటూ సీఎంకు ఎంపీ రేవంత్రెడ్డి లేఖ - mlkajgiri mp revanth reddy letter to cm kcr on srisailam incident
శ్రీశైలం దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్కు లోక్సభ సభ్యుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్రెడ్డి లేఖలో కోరారు.
![ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలంటూ సీఎంకు ఎంపీ రేవంత్రెడ్డి లేఖ mp revanth reddy letter to cm kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8507585-857-8507585-1598017746994.jpg)
ఒక్కొక్కరికి రూ. కోటి ఇవ్వాలంటూ సీఎంకు ఎంపీ రేవంత్రెడ్డి లేఖ
శ్రీశైలం దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయని.. ఏపీ సీఎం జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ప్రాజెక్టును చంపే కుట్ర చేస్తున్నారని చాలా కాలంగా తాము చెబుతూ వస్తున్నామని ఈ దుర్ఘటనతో పలు అనుమానాలకు తావిస్తోందని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.