MLC Kavitha at Saligram & Techsmart: రాష్ట్ర యువతను.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ అబాకస్ ఐటీ పార్కులో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కవిత హర్షం వ్యక్తం చేశారు.
MLC Kavitha at Saligram & Techsmart: 'దేశంలోనే నెంబర్ 1 గా హైదరాబాద్ ఐటీ' - saligram and tech smart in uppal
MLC Kavitha at Saligram & Techsmart: ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో అన్ని వైపులా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ విధానం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఉప్పల్ ఐటీ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ కంపెనీని కవిత ప్రారంభించారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందని కవిత తెలిపారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని కవిత అభినందించారు. ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Balka suman on singaren strike: 'అదానీకి కట్టబెట్టేందుకే సింగరేణి బొగ్గు గనుల వేలం'