తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌ల‌ప‌డాలి' - ఎమ్మెల్సీ కవిత

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

mlc kavitha attended womens day celebrations in boinpalli medchal
'అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌ల‌ప‌డాలి'

By

Published : Mar 8, 2021, 8:58 PM IST

మహిళలు.. సమాజంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి రంగంలో పురుషులతో సమానంగా రాణించాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో.. ఆర్థిక స్వావ‌లంబనతో మ‌హిళ‌ల‌కు నిర్ణ‌యాధికారం పెరుగుతుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా

ABOUT THE AUTHOR

...view details