హైదరాబాద్ నగర శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న అంబీర్ లేక్ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ పరిశీలించారు. అధికార యంత్రాంగం అంతా ‘కరోనా‘ నియంత్రణలో నిమగ్నమైనప్పటికీ అభివృద్ధి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యేలు అన్నారు.
అంబీర్ లేక్‌ను పరిశీలించిన ఎమ్మెల్యేలు - lockdown
హైదరాబాద్ నగర శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబీర్ లేక్ పనులను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు.

అంబీర్ లేక్‌ను పరిశీలించిన ఎమ్మెల్యేలు
అంబేడ్కర్ చెరువు సుందరీకరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని... ఇప్పటికే పనులు సగానికి పైగా పూర్తిచేశామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించామని తెలిపారు.
ఇవీ చూడండి: తగ్గుతున్న కేసులు.. పలుచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత