మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఎన్సీఎల్ నార్త్ కాలనీలో రూ.10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి మంచినీటి నల్లాను ప్రారంభించారు.
ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే వివేకాంద్ పేర్కొన్నారు. కోట్ల నిధులతో గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా అనేక రిజర్వాయర్లు నిర్మిస్తూ మంచి నీటి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.