తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే - pattana pragathi

మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలోని సుభాష్​నగర్​ డివిజన్​ పరిధిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే వివేక్​ పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కాలనీల్లో చెత్తచెదారాలను తొలగించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

mla vivek participated in pattana pragathi programme in medchal district
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

By

Published : Jun 4, 2020, 1:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్, అపురూప కాలనీల్లో ఎమ్మెల్యే వివేక్ పర్యటించారు. కాలనీల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపర్చారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీ రాజేందర్ రెడ్డి, ఉప కమిషనర్ మంగతాయారు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రెండో విడత 'పట్టణ ప్రగతి' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details