కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలు, సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేట్ బషీరాబాగ్లోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు.. ఆసుపత్రుల్లో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలను ఆయన వైద్యులతో చర్చించారు.
బస్తీ దవాఖానాల్లో కరోనా వైద్యసేవలపై ఎమ్మెల్యే వీడియో కాన్ఫరెన్స్ - latest news of kutbhullapur
మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ బస్తీ దవాఖానాల్లో అందిస్తున్న వైద్య సేవలు, కరోనా తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే కేపి వివేకాినంద్ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు.
బస్తీ దవాఖానాల్లో కరోనా వైద్యసేవలపై ఎమ్మెల్యే వీడియోకాన్ఫరెన్స్
పీపీఈ కిట్లు, సిబ్బంది కొరత ఎన్ 95 మాస్కులు, పారాసిట్ మాల్ మందుల కొరత తీవ్రంగా ఉందని వైద్యులు తెలపడం వల్ల ఈ సమస్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు