తెలంగాణ

telangana

వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు

By

Published : Oct 18, 2020, 5:08 PM IST

వర్షాలకు జలమయమైన మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా ఎమ్మెల్యే మైనంపల్లి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో కాలనీలను శానిటైజ్​ చేపిస్తున్నారు.

mla taking actions for not spreading  Diseases
mla taking actions for not spreading Diseases

వర్షాల కారణంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఎమ్మెల్యే మైనంపల్లి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పటేల్​నగర్ ప్రాంతంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఎమ్మెల్యే మైనంపల్లి సొంత నిధులతో హైడ్రాక్సీ క్లోరో క్వీన్ మిశ్రమాన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటైజేషన్ చేపించారు.

అక్రమ కట్టడాలను కూల్చివేసి భవిష్యత్తులో నాలాలు పొంగి కాలనీల్లో నీళ్లు చేరకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల యజమానులతో మాట్లాడి ఒప్పించి వారికి ఆర్థిక సాయం అందించి ఎక్కడా ఎటువంటి నిరసన లేకుండా కూల్చివేతలు సాగిస్తున్నామన్నారు.

ఇదీ చూడండి:జూబ్లీహిల్స్‌లో సెల్లార్ వద్ద గుంతలో పడి చిన్నారి మృతి

ABOUT THE AUTHOR

...view details