కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కార్పొరేటర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వీధి వ్యాపారులకు స్వనిధి రుణాలు అందిస్తామని చెప్పారు. వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద 10 వేల రూపాయల ఋణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందజేస్తున్నట్లు చెప్పారు.
వీధి వ్యాపారులకు రుణాలు: ఎమ్మెల్యే వివేకానంద - ఎమ్మెల్యే వివేకానంద వార్తలు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీధి వ్యాపారులకు స్వనిధి రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు కార్పొరేటర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీధి వ్యాపారులకు రుణాలు: ఎమ్మెల్యే వివేకానంద
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో ఇప్పటి వరకు ఎందరికి రుణాలు అందిస్తున్నారో అధికారులను వివరాలు అడిగారు. గాజుల రామారం సర్కిల్లో 1694, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 1357 మందిని గుర్తించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కేంద్రం 'దిగుమతి' నిర్ణయం.. మొక్కజొన్న రైతులకు శరాఘాతం