తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - ట్రాన్స్ జెండర్లకు వాక్సినేషన్

మేడ్చల్ జిల్లా సూరారం యూపీహెచ్​సీలో ట్రాన్స్ జెండర్లకు ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్ సన్​, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కలిసి ప్రారంభించారు. కొవిడ్​ బారి నుంచి రక్షించుకోవడానికి ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Medchal District Suraram
'కరోనా తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

By

Published : Jun 11, 2021, 4:07 PM IST

మేడ్చల్ జిల్లాకు చెందిన ట్రాన్స్​జెండర్లకు సూరారంలోని యూపీహెచ్​సీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్​సన్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కలిసి ప్రారంభించారు.

కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే హైరిక్స్ కేటగిరీలో ఉన్న ట్రాన్స్​జెండర్లకు వాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. ఏడు రోజుల పాటు ఈ కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్​ కొనసాగుతుందన్నారు.

ఈ అవకాశాన్ని మేడ్చల్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా ప్రభావం తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ డాక్టర్ నిర్మల, కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీ మంగతాయారు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'తోపులాటలో కిందపడ్డ జీవన్​రెడ్డి.. బలవంతంగా స్టేషన్​కు తరలింపు'

ABOUT THE AUTHOR

...view details