మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ వద్ద రహదారిపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేపట్టారు. సుచిత్ర నుంచి కొంపల్లికి వెళ్లే దారిలో.. యూటర్న్ తీసుకోవడానికి 3 కి.మీ వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. మూసేసిన సర్వీస్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
రహదారిపై ఎమ్మెల్యే హన్మంతరావు నిరసన - ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ వద్ద రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూసేసిన సర్వీస్ రోడ్డును తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రోడ్డుపై నిరసన చేపట్టారు.
రహదారిపై ఎమ్మెల్యే హన్మంతరావు నిరసన
యూటర్న్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ.. రెండు రోజుల్లో దానిని తొలగిస్తామని చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
ఇదీ చదవండి:పెరుగుతున్న ధరలకు ఎవరు బాధ్యులు: కేటీఆర్