మేడ్చల్ జిల్లా ఆల్విన్ కాలనీలో జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, ఎంటమాలజీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దోమలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు ఇంటి ఆవరణను శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
దోమల నివారణపై ఎమ్మెల్యే అవగాహన కార్యక్రమం - MLA arikepudi gandhi latest news
ఒక దోమ జీవితకాలమైన 20 రోజుల్లో పదివేల వరకూ దోమలను ఉత్పత్తి చేస్తుందని, వీటి వల్ల నెల వ్యవధిలో లక్షల దోమలు ఉత్పత్తై సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు.
![దోమల నివారణపై ఎమ్మెల్యే అవగాహన కార్యక్రమం mla arikepudi gandhi awarerness programme on mosquitesmla arikepudi gandhi awarerness programme on mosquites](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7419778-480-7419778-1590922306771.jpg)
దోమల నివారణపై ఎమ్మెల్యే అవగాహన కార్యక్రమం
దోమల నివారణకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, ఎంటమాలజీ అధికారుల ఆధ్వర్యంలో కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ డివిజన్లో దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కాకతీయ నగర్, వెంకట సాయి నగర్ కాలనీల్లోని తిరుగుతూ ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంట్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా