మేడ్చల్ జిల్లా మియాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లాక్డౌన్ కారణంగా రక్త నిల్వలు తక్కువగా ఉండటం వల్ల తలసేమియా, క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
'తలసేమియా, క్యాన్సర్ బాధితులకు ప్రాణదానం చేయండి' - Miyapur Polices conducted Blood camp latest news
తలసేమియా, క్యాన్సర్ రోగుల సహాయార్థం మియాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వారిని ఆదుకోవటానికి తమవంతుగా రక్తదానం చేయాలని సూచించారు.
తలసేమియా రోగులను ఆదుకోండి
వారిని ఆదుకోవటానికి ప్రతిఒక్కరూ తమవంతుగా రక్తదానం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.