మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పులు దొర్లకుండా చేస్తామంటున్న అధికారుల మాట ముమ్మాటికీ తప్పని నిరూపిస్తోంది వారి తీరు. వార్డుల వారీగా కులగణను చేసినప్పటికీ.. అధికారులు తప్పులు గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒక వార్డుకు చెందిన వారికి వేరే వార్డులో ఓట్లు ఇచ్చారంటూ ఆరోపించారు.
ఏడవ వార్డులో ఉన్న ఓ హాస్టల్లో దాదాపు 400 మంది విద్యార్థులకు ఓట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెరాస ఓట్ల దండుకోవడం కోసమే విద్యార్థులను మభ్యపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుండిగల్ మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు.