ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు - today crime news in telangana
13:41 July 02
ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు
మేడ్చల్ జిల్లా పోచారంలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపాడో కిరాతకుడు. చిన్నారి తల్లితో సహా మరో యువకుడిపై కూడా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఘటనాస్థలి నుంచి రమేశ్ అనే యువకుడు పరారయ్యాడు. దాడి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. చిన్నారి తల్లి, నిందితుడు కరుణాకర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్