మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలతో ఆర్థిక సాయాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
' సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు' - minister malla reddy visit to ghatkesar in medchal district
కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో పేదల కుటుంబాల్లో తెలంగాణ సర్కార్ వెలుగు నింపుతోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఘట్కేసర్లో కార్మిక మంత్రి మల్లారెడ్డి పర్యటన
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, పురపాలక ఛైర్పర్సన్ ముల్లి పావని పాల్గొన్నారు. అనంతరం తెరాస నేత మేకల మధుసూదన్ రెడ్డి అందించిన స్వర్గపురి వాహనాన్ని ఎమ్మెల్యే సుభాశ్ రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.