మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జటాయు అర్బన్ ఫారెస్టు పార్క్‌ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అడవులు అంతరించడం వల్ల పట్టణ ప్రజలంతా..స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రమంతా పచ్చగా ఉండాలనే సంకల్పంతో.. తమ ప్రభుత్వం ఈ పార్క్‌ను 1250 ఎకరాల్లో రూ.కోటితో నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. మెుక్కలను నాటాలేగానీ నరకొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడవులే మన ఆరోగ్యానికి ప్రాణాధారమని పేర్కొన్నారు.
జటాయు ఫారెస్టు పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు - Ministers who opened Jatayu Forest Park
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి మండలకేంద్రంలో జటాయు అర్బన్ ఫారెస్టు పార్క్‌ను మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కలసి ప్రారంభించారు. అడవులే మన ఆరోగ్యానికి ప్రాణాధారమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
జటాయు ఫారెస్టు పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు