తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల

శామీర్​పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లలు 38 లక్షల మందికి పైగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. శామీర్​పేట ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ministers-etela-rajender-and-mallareddy-launch-pulse-polio-program-at-shameerpet-health-centre-in-medchal-malkajgiri-district
శామీర్‌పేట్ ఆస్పత్రిని ట్రామాకేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: ఈటల

By

Published : Jan 31, 2021, 1:25 PM IST

శామీర్‌పేట్ ఆస్పత్రిని ట్రామాకేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతాం: ఈటల

రాష్ట్ర వ్యాప్తంగా 23,331 పోలియో కేంద్రాలు, 877 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. చిన్నారులకు మంత్రులు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో 38,31,907 మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి వెల్లడించారు.

పల్స్ పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందని వెల్లడించారు. ఫ్రంట్ వారియర్స్​గా సేవలందించిన వివిధ శాఖల వారికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు వివరించారు. శామీర్​పేట్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్థానికంగా ట్రామాకేర్ సెంటర్​ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పోషకాల పల్లీలు... చాలా టేస్ట్ గురూ!

ABOUT THE AUTHOR

...view details