తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం​ చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: మంత్రి వేముల - కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రచారం

గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస నాయకులు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి కుత్బుల్లాపూర్​ నియోజక వర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లకు తాను ఇన్​ఛార్జిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

minister vemula campaign in kuthbullapur
కేసీఆర్​ చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: మంత్రి వేముల

By

Published : Nov 25, 2020, 3:40 PM IST

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు తెరాస తరఫున మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఇన్​ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాజులరామారం డివిజన్ అభ్యర్థి తరఫున లెనిన్​నగర్​లో ప్రచారంలో పాల్గొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు ఎనిమిది గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తెరాసను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, తన నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఈ మేరకు ఆయనను అభినందించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని ఓటర్లను కోరారు.

కేసీఆర్​ చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: మంత్రి వేముల

ఇదీ చదవండి:పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటోన్న వారిపై సర్జికల్ స్ట్రైక్: స్మృతి ఇరానీ

ABOUT THE AUTHOR

...view details