Minister Niranjan Reddy: మాంసమైనా వ్యవసాయ ఉత్పత్తులు అయినా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీలో ఉండగలుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్‌ను తట్టుకుని నిలబడగలుతామన్నారు. హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్‌ను వనపర్తి గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్థకశాఖ అధికారులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించి మొక్కను నాటారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదించిందని... పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో గొర్రెలు 7 నుంచి 5 కోట్లు ఉంటే ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల గొర్రెలున్నాయని మంత్రి వివరించారు.
'ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదించింది' - telangana news
Minister Niranjan Reddy: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదించిందని... పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్మీట్ను మంత్రి అధికారులతో కలిసి సందర్శించారు. గొర్రెలు, మేకల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి ఈ దిశగా మాంసం ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు.
ఏడాదికి దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6కిలోలు ఉంటే తెలంగాణ సగటు తలసరి వినియోగం 23కిలోలని అంటే మనకున్న గొర్లు కాక ప్రతీరోజు ఇతర రాష్ట్రాలవి దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల మన గొర్ల సంఖ్య ఇంకా పెంచుకుంటూ, మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్‌ను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలని... కనీసం 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి ఈ దిశగా మాంసం ఎగుమతులపై దృష్టిసారించాలన్నారు. కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే వ్యర్థాల మిశ్రమాలు గొర్రెల మేతకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌజ్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. వనపర్తి గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలోని 192 సంఘాలు మాంసం ఎగుమతుల మీద దృష్టి సారించాలని సూచించారు.
ఇవీ చదవండి: