శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు చేసి.. మరింత సేవ చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా కూకట్‌పల్లిలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రెస్క్యూ హోంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోమ్‌లోని మహిళలు నేర్చుకున్న వివిధ రకాల పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు: సత్యవతి రాఠోడ్ - cm kcr birthday latest news
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం రెస్క్యూ హోంలో కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ హాజరై మొక్కలు నాటారు.

శిశు సంక్షేమ శాఖకు మరిన్ని సంస్కరణలు: సత్యవతి రాఠోడ్
అనంతరం ఆల్విన్ కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణం అభివృద్ధికి నోచుకోక పోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోవు రోజుల్లో ఈ మహిళా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతులు, మహిళలకు చేతి వృత్తులు, ఉపాధి అవకాశాల కల్పన నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఇవీచూడండి:వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్