తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతి'

మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్​ మండలం వెంకటాపూర్​లోని నూతనంగా ఏర్పాటు చేసిన అనురాగ్​ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని పేర్కొన్నారు.

Minister Sabitha IndraReddy in Anurag University Opening Ceremony
Minister Sabitha IndraReddy in Anurag University Opening Ceremony

By

Published : Aug 3, 2020, 7:59 PM IST

నాణ్యమైన విద్యను అందించే.. ఉద్దేశంతో రాష్ట్రంలో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని... మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్​ జిల్లా ఘట్కేసర్​ మండలం వెంకటాపూర్​లోని నూతనంగా ఏర్పాటు చేసిన అనురాగ్​ విశ్వావిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

అనురాగ్​ విశ్వావిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాయికి అనురాగ్ విశ్వవిద్యాలయం ఎదగాలని, ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు లభించే విధంగా విద్యాబోధన జరగాలని ఆకాంక్షించారు. అనురాగ్ విద్యాసంస్థ కఠినమైన ప్రమాణాలు పాటించిందని అందుకే రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించిందని పేర్కొన్నారు.

అనురాగ్​ విశ్వావిద్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details