గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండడంతో తెరాస ఎన్నికల ప్రచారంలో.. భాగంగా గాజులరామరం డివిజన్ ఇంఛార్జ్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెరాస అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు.
స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి వేముల - GHMC Elections 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. గాజులరామరంలో తెరాస అభ్యర్థి తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్థానిక సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి వేముల
20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా ఇవ్వడం అదృష్టమని మంత్రి అన్నారు. అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :'వర్షం పడితే అంతే.. నగరం మునిగి పోతుంది'