తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం పనులను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

మేడ్చల్​ నియోజకవర్గంలో 44వ జాతీయ రహదారి వెంబడి జరుగుతున్న హరితహారం పనులను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు.

mallareddy visit harithaharam works
హరితహారం పనులను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Jun 12, 2020, 8:14 PM IST

మేడ్చల్ నియోజకవర్గంలో చేస్తున్న హరితహారం పనులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. 44వ జాతీయ రహదారి, రాజీవ్ రహదారి, వరంగల్ హైవే వద్ద చేస్తున్న పనులను తనిఖీ చేశారు. తూంకుంట నుంచి తుర్కపల్లి వరకు... ఉప్పల్ నుంచి ఘట్​కేసర్ వరకు.... కొంపల్లి నుంచి మేడ్చల్ వరకు... మున్సిపాలిటీ పరిధిలో రహదారికిరువైపులా మొక్కలు నాటుతున్నట్లు వివరించారు.

ఈ నెల 18న మొక్కలునాటే కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు, మంత్రి కేటీఆర్​ పాల్గొంటారని తెలిపారు.

ఇదీ చూడండి:డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details