మేడ్చల్ జిల్లా తూంకుంట పురపాలికలో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలోని సీసీ రోడ్ల నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తూంకుంట పురపాలికలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన - మేడ్చల్ జిల్లాలో మంత్రి పర్యటన
మేడ్చల్ జిల్లా తూంకుంట పురపాలికలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
తూంకుంట పురపాలికలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలకు స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.