మేడ్చల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బ్యాట్ పట్టిన మంత్రి మల్లారెడ్డి.. - telangana varthalu
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
కరోనా కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారన్న మంత్రి... సంవత్సరం నుంచి క్రీడలకు దూరమయ్యారని అన్నారు. క్రికెట్ పోటీల నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నిర్వాసితులకు పరిహారం.. ఆ తర్వాతే రోడ్డు విస్తరణ: సంజయ్