తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమం ఆగలేదు: మంత్రి మల్లారెడ్డి - minister mallareddy started bhumi pooja at medchal district

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో రాయిలాపూర్​, పూడూర్​ గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి భూమిపూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

minister mallareddy at medchal district started bhumi pooja
రైతు వేదిక నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

By

Published : Jul 13, 2020, 7:23 PM IST

కరోనా వేళలోనూ రైతు సంక్షేమం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో రాయిలాపూర్​, పూడూర్​ గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్​, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రైతువేదికల ద్వారా రైతుల సాధకబాధకాలు చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కొవిడ్​ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్​ శరత్​ చంద్రారెడ్డి ఉన్నారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details