మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, అదనపు కలెక్టర్ నర్సింహ రెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి... జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
Minister mallareddy: కీసరలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి... జాతీయ జెండాను ఎగురవేశారు.

malla reddy
తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని మంత్రి పేర్కొన్నారు. నిరు పేద ప్రజల కోసం వృద్ధాప్య పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను తీసుకొచ్చారని కొనియాడారు. ప్రాజెక్టులు నిర్మించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ