తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ వచ్చాకే మేడ్చల్‌లో మార్పు: మంత్రి మల్లారెడ్డి - telangana news

తెలంగాణ ఏర్పడ్డాకే మేడ్చల్‌ నియోజకవర్గం రూపు రేఖలు మారాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఘట్‌కేసర్‌ పురపాలికలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు రూ. 2.60 కోట్లతో చేపడుతున్న పలు పనులను ఆయన ప్రారంభించారు.

minister mallareddy on medchal malkajgiri
తెలంగాణ వచ్చాకే మేడ్చల్‌లో మార్పు: మంత్రి మల్లారెడ్డి

By

Published : Feb 10, 2021, 8:02 AM IST

తెలంగాణ ఏర్పడ్డాకే మేడ్చల్‌ నియోజకవర్గం రూపు రేఖలు మారాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ. 2.60 కోట్లతో చేపడుతున్న బీటీ, డ్రైనేజీ, పార్కులు నిర్మాణ పనులు, వైకుంఠధామంతో పాటు... వరంగల్‌ జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన స్వాగత ముఖద్వారాన్ని ఛైర్‌పర్సన్‌ ముల్లి పావని యాదవ్‌తో కలిసి ప్రారంభించారు.

ఘట్‌కేసర్‌ పురపాలికలో తేడా లేకుండా అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details