ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలు నాటారు.
రైతువేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు చెక్కులను అందజేశారు. కరోనా వైరస్ను అరికట్టడానికి ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను కూడా లీజుకు తీసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు