తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister MallaReddy: మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయి - Minister Mallareddy Educational Institutions Disputes

ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో.. మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలోని పురపాలక సంఘాల్లో నిధుల కొరత లేకుండా పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు.

Minister Mallareddy
Minister Mallareddy

By

Published : Jun 16, 2021, 10:09 PM IST

మేడ్చల్‌ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో నిధుల కొరత లేకుండా పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.1.80 కోట్ల వ్యయంతో చేపడుతోన్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఘట్‌కేసర్‌లోని క్యాంపు కార్యాలయంలో.. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జడ్పీ ఛైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది

ABOUT THE AUTHOR

...view details