రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టవచ్చని భావించి.. కష్టపడకుండా వచ్చే పార్టీలు రోడ్డుకే పరిమితం అవుతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. షర్మిల పెట్టబోయే పార్టీ తెలంగాణలో నిలబడదని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో సుమారు రూ.1.70 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఛైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి ప్రారంభించారు.
తెలంగాణలో షర్మిల పార్టీ నిలబడదు: మల్లారెడ్డి - షర్మిల కొత్తపార్టీపై మంత్రి మల్లారెడ్డి విమర్శలు
షర్మిల పెట్టబోయే పార్టీ తెలంగాణలో నిలబడదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో సుమారు రూ. 1.70 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
మంత్రి మల్లారెడ్డి
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మల్లారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం రూపు రేఖలు మారాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టామని చెప్పారు.
ఇదీ చదవండి:నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన