తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతును రాజును చేయడమే లక్ష్యం: మల్లారెడ్డి - రైతువేదిక భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్, ప్రతాప్ సింగారం గ్రామాలలో రైతు వేదిక భవనాల నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

Minister mallareddy inaugurated raithu vedika buildings
Minister mallareddy inaugurated raithu vedika buildings

By

Published : Jul 21, 2020, 2:57 PM IST

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్, ప్రతాప్ సింగారం గ్రామాలలో రైతు వేదిక భవనాల నిర్మాణానికి కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రైతులు సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు కస్టర్ల వారీగా రైతు వేదిక భవనాలను నిర్మించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా ద్వారా ప్రభుత్వం.. అన్నదాతకు భరోసా కల్పిస్తోందన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details