తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మల్లారెడ్డి - తెలంగాణ వార్తలు

ప్రజా క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మల్లారెడ్డి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మల్లారెడ్డి

By

Published : Jun 13, 2021, 4:56 PM IST

మేడ్చల్​ జిల్లా పరిధిలోని పలువురికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించారు. బోయిన్​పల్లిలోని మంత్రి కార్యాలయంలో 4.10లక్షల రూపాయల చెక్కులను ఇచ్చారు.

పేదలకు భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని అన్నారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎంఆర్ఎఎఫ్ ద్వారా సహాయం అందుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

ABOUT THE AUTHOR

...view details