తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​కు తెలంగాణ ఆడపడుచుల సంతోషమే ముఖ్యం' - minister mallareddy

కరోనా వంటి కష్టకాలంలోనూ వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ దసరా కానుక అందిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్​పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు.

minister mallareddy
మేడ్చల్​లో బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Oct 10, 2020, 2:46 PM IST

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్, మూడుచింతలపల్లి మండలాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ఆడపడుచులందరికి దసరా కానుకగా ఈ చీరలను అందిస్తున్నారని తెలిపారు.

మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవడానికే.. కరోనా వంటి కష్టకాలంలోనూ.. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చీరలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details