మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో రూ. యాభై లక్షలతో చేపట్టనున్న పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అన్నింటికి మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన - minister mallareddy bhumi pooja to development works at nagaram
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారంలో రూ. 50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.