'పుర'లొల్లి: మంత్రి మల్లారెడ్డిపై 'పైసల' ఆరోపణలు! - Municipal elections 2020 latest news
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలిక ఎన్నికల్లో అధికార పార్టీలో అసమ్మతి భగ్గుమంది. టికెట్ల కేటాయింపులో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేదలకు అన్యాయం చేశారని ఆపార్టీ నేత రాములు ఆరోపించారు. సుమారు రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు డబ్బులు తీసుకుని టికెట్లు కేటాయించారని విమర్శించారు. మంత్రి డబ్బులు తీసుకున్న ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో వాటిని ప్రజల ముందు ఉంచుతామన్నారు. మంత్రి మల్లారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మంత్రికి తగిన బుద్ధి చెప్తారన్నారు.

minister malla reddy latest news
.
'టికెట్లు ఇవ్వటానికి మంత్రి డబ్బులు తీసుకున్నారు...ఆధారాలు ఉన్నాయి'