ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అన్నదాతలను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని... రైతులను రారాజుగా చేయాలనే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు
'రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారు' - మేడ్చల్ లేటెస్ట్ అప్డేట్స్
కీసరలో రైతు వేదికను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అన్నదాతలను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని తెలిపారు. రైతులను రారాజు చేయడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
!['రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారు' minister malla reddy inaugurated raithu vedika at keesara in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9425667-158-9425667-1604473350022.jpg)
'రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ ముందున్నారు'
రైతు బంధుతో పాటు అన్నదాతలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. రైతులంతా ఒకే చోట సమావేశమై అనుభవాలు పంచుకోవడం కోసం రైతు వేదికను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:'ఆర్టీసీ నష్టాలు వీడి... లాభాల్లోకి పరిగెత్తేనా?'