మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ముస్లింలకు మేయర్ కావ్య నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై...ముస్లింలకు నిత్యావసర సరకులను అందజేశారు.
ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి - నిత్యావసరాల పంపిణీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముస్లింలకు సూచించారు. ఇంకా కొన్ని రోజుల పాటు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను తరిమేయవచ్చన్నారు.
Medchal district latest news
లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పండుగ రావడం బాధగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ముస్లింలంతా సంతోషంగా ఈద్ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా సరకులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ , కార్పొరేటర్లు, తెరాస నేతలు పాల్గొన్నారు.