తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
'అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక సర్కార్ తెలంగాణ' - telangana labor minister malla reddy
తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కార్మిక మంత్రి మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డి
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే అందులో 500 బాలికల కోసం కేటాయించినవేనని తెలిపారు. కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, లాక్‌డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
- ఇదీ చదవండి :కరోనా టెస్టు చేయించుకోలేదని యువకులపై దాడి