కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి కష్టకాలంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయులకు బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్‌దే' - మేడ్చల్‌లో ప్రేవేటు ఉపాధ్యాయులకు బియ్యం, నగదు పంపిణీ
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రైవేటు టీచర్లను ఆదుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ పట్టణంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి 25కిలోల బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
minister malla reddy
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సాయం మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 19వేల మంది ఉపాధ్యాయులు లబ్ధిపొందుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. అనంతరం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనారాయణం దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఇదీ చూడండి:'ఫోన్ ద్వారా సమాచారమిస్తే.. ఇంటికే వచ్చి కరోనా పరీక్షలు'