కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంగడిపేటలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేను ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి పరిశీలించారు. అవసరమున్న వారికి మందులు, మెడికల్ కిట్లను అందజేశారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే ద్వారా బాధితులను ముందుగానే గుర్తించే వీలుందని పేర్కొన్నారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి నివారణ, జాగ్రత్తలు తీసుకోవడానికి వీలయిందన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.