తెలంగాణ

telangana

ETV Bharat / state

మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తాం: కేటీఆర్​ - hyderabad latest news

హైదరాబాద్​ సనత్​నగర్​లో క్రీడా సముదాయం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్​ను మంత్రి తలసానితో కలిసి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. భాగ్యనగరంలో మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

minister ktr we will complete the remaining works in hyderabad
మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తాం: కేటీఆర్​

By

Published : Nov 13, 2020, 2:20 PM IST

Updated : Nov 13, 2020, 2:27 PM IST

మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తాం: కేటీఆర్​

దశలవారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​ సనత్​నగర్​లో క్రీడా సముదాయం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్​ను మంత్రి తలసానితో కలిసి ఆయన ప్రారంభించారు. హైదరాబాద్​లో చాలా పనులు మిగిలి ఉన్నాయని, మున్ముందు పూర్తి చేస్తామని కేటీఆర్​ అన్నారు. సనత్​నగర్ నియోజకవర్గాన్ని మంత్రి తలసాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్​పై గతంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశామని.. రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పెంచాలనేది కేసీఆర్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

సనత్​నగర్​లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని.. నగరానికి తలమానికంగా సనత్​నగర్​లో ఇండోర్ స్టేడియం నిర్మించామని మంత్రి తలసాని చెప్పారు. ఫతేనగర్ బ్రిడ్జి వైండేనింగ్ చేస్తున్నామని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని, వరదల సమయంలో ఏ పార్టీ కూడా బాధితులను అదుకోలేదని చెప్పారు.

వరద బాధితులకు ఆర్థికంగా సాయం అందించామని.. మిగిలిన వారికి రెండు రోజుల్లో అందిస్తామని తలసాని వెల్లడించారు. గతంలో అనేక సమస్యలే ఉండేవని, వాటిని పరిష్కరించామని.. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

ఇదీ చూడండి:పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్

Last Updated : Nov 13, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details