మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, తెరాస నేతలు హాజరయ్యారు.
ఆనాడు కరెంట్ లేక ఇక్కడ పరిశ్రమల ముందు టెంట్లు వేసుకుని ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూశామని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయి కార్మికులు ఓటీ చేసుకుంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి విద్యావేత్త, మంచి పేరున్న కుటుంబం నుంచి వచ్చారని మంత్రి కొనియాడారు. భాజపాకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. రోజూ ఇంధన ధరలు పెంచుతున్నారని దుయ్యబట్టారు.
భాజపా, కాంగ్రెస్‌లకు దిల్లీలో హైకమాండ్ ఉంటుంది.. కానీ మనకు గల్లీలో ఉంటుందని అన్నారు. పీవీకి కనీస గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. ఆయనకు కనీసం సమాధి కూడా కట్టలేదన్నారు. సీఎం కేసీఆర్ పీవీకి సముచితమైన గౌరవం ఇవ్వడం కోసం హైదరాబాద్‌లోనే పీవీ ఘాట్ నిర్మించారని వెల్లడించారు.
ఇదీ చూడండి :మేడారంలో ఉద్యోగులకు కరోనా పాజిటివ్