ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు తీరిక లేకుండా గడుపుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలోని బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరారు.
బ్రహ్మకుమారీలు.. ధ్యాన కేంద్రంలోని చిత్ర పటాలు చూపిస్తూ వాటి అర్థాన్ని మంత్రికి వివరించారు. అనంతరం బ్రహ్మకుమారీస్ జెండాను రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో కలిసి ఎగురవేశారు.