తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదవారి కడుపు నింపిన పార్టీ తెరాస: ఈటల - ఈటల రాజేందర్ లేటెస్ట్ న్యూస్

రాష్ట్ర అభివృద్ధికి తెరాస కృషి చేస్తుంటే భాజపా కావాలనే బురద జల్లుతోందని మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటున్నారని... కొందరు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాలాజీ నగర్ డివిజన్‌లో ఇతర పార్టీల కార్యకర్తలు కొందరు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

minister-etela-rajendar-about-trs-government
పేదవారి కడుపు నింపిన పార్టీ తెరాస: ఈటల

By

Published : Nov 26, 2020, 6:49 PM IST

పేదవారి కడుపు నింపిన పార్టీ తెరాస అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి తెరాస కృషి చేస్తుంటే... ఓర్వలేక భాజపా బురదజల్లుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్‌లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు.

రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ నగరంలో ఎటువంటి మత కల్లోలాలు జరగలేదని, నేరాల రేటు తగ్గిందని ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయటంతో హైదరాబాదు నగరం ప్రశాంతంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారని, కొందరు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

పేదవారి కడుపు నింపిన పార్టీ తెరాస: ఈటల

ఇదీ చదవండి:'15 ఏళ్లుగా సేవలందిస్తున్నాం... క్రమబద్ధీకరించడం లేదు'

ABOUT THE AUTHOR

...view details