రైతు దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మండలంలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎమ్ఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన 40 లక్షల విలువ చేసే.. వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అందజేశారు.
రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి: మల్లారెడ్డి - Minister Mallareddy Speech
మేడ్చల్ జిల్లాలో 40 లక్షల విలువ చేసే.. రైతులకు వ్యవసాయ పరికరాలను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఎమ్ఎల్ఆర్ సంస్థ రైతులకు పరికరాలు అందజేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
రైతుల కోసం విద్యార్థులు వేర్వేరు కంపెనీలతో సంప్రదింపులు జరిపి.. పరికరాలు తయారు చేశారని ఎమ్ఎల్ఆర్ సంస్థ అధినేత రాజశేఖర్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మరో 4 మండలాల్లో కోటి అరవై లక్షలతో వ్యవసాయ పరికరాలు అందజేసి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా తయారు చేస్తున్నట్లు తెలిపారు.