తమ రాష్ట్రానికి రైలు సదుపాయం లేదని పోలీసులు చెప్పగా.. ఒడిశాకు చెందిన వలస కార్మికులు కాలినడకన తమ ఊళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ ఎర్రగడ్డ నుంచి బయలుదేరి మేడ్చల్ జాతీయ రహదారి గుండా స్వస్థలాలకు వెళ్తున్నారు.
కాలినడకనే సొంతూళ్లకు పయనం - migrant labor returning on foot
వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వగా రాష్ట్ర సర్కార్ వారికోసం ప్రత్యేక రైళ్లు కేటాయించింది. తమ రాష్ట్రానికి రైలు లేదని పోలీసు అధికారులు చెప్పగా ఒడిశాకు చెందిన కార్మికులు కాలినడకన ఊరికి పయనమయ్యారు.
కాలినడకనే సొంతూళ్లకు పయనం
సుమారు 35 మంది ఒడిశాకు చెందిన వలస కూలీలు మూటా ముళ్లెలు పట్టుకుని, భార్యా పిల్లలతో ఊరికి బయలుదేరారు. మధ్యమధ్యలో దాతలు అందిస్తోన్న ఆహారమే వారి కడుపు నింపుతోంది.