'వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' - 'వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం యమ్మంపేటకు చెందిన మీసాల మల్లేశం తనకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. తనకు చెందిన రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
!['వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' meesala mallesham request to cm kcr for protect them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7660767-253-7660767-1592413512714.jpg)
'వంద కోట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు'
భూ కబ్జాదారులు నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం యమ్మంపేట్ గ్రామస్థుడు మీసాల మల్లేశ్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తమకు చెందిన సుమారు రూ.100 కోట్లు విలువగల 25 ఎకరాల వారసత్వ భూమిని కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ పలుకుబడితో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై దౌర్జన్యం చేస్తున్న వారి నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు మీసాల మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు.